![]() |
![]() |

నిద్రపోవడానికి కొంతమంది దేశాలు దాటి పోతున్నారు. అందులోను బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ అశ్వినిశ్రీ మాత్రం నిద్రపోవడానికి దుబాయ్ కి వెళ్ళిందంట. అక్కడ నైట్ ఒక హోటల్ రూమ్ లో స్టే చేసిన అశ్వినిశ్రీ.. ఓ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
దుబాయ్ కి ఎవరైన ఎందుకు వస్తారు. అంతా తిరగడానికి ఎంజాయ్ చేయడానికి వస్తారు. నేను మాత్రం ఇక్కడ నిద్రపోడానికి వచ్చాను. పడుకుంటే నిద్ర రావడం లేదు. ఎనీ సజెన్స్.. పడుకోవాలా వద్దా అంటు ఇన్ స్ట్రాగ్రామ్ లోని తన అభిమానులని అడిగింది అశ్వినిశ్రీ. బోరింగ్ గా ఉందంట అంటు తను చెప్పడంతో తన ఇన్ స్టాగ్రామ్ లోని అభిమానులంతా పోటీపడి మరి కామెంట్లు చేస్తున్నారు. అయితే అశ్వినిశ్రీని కొంతమంది అరేబియన్ గుర్రమని అంటారు. అందుకేనేమో తనెప్పుడు దుబాయ్ కి వెళ్ళొస్తుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి అశ్వినిశ్రీ దుబాయ్ కి ఎందుకు వెళ్లిందనేది తనకే తెలుసు.
హైదరాబాద్ పిల్ల అశ్వినిశ్రీ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు హాట్ ట్రీట్‌తో ఫ్యాన్స్‌కి ఊపిరాడనివ్వకుండా చేస్తుంది ఈ అశ్విని. చీర కట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా నాభి అందాలు చూపిస్తూ రెచ్చిపోవడం ఈ బ్యూటీ కి అలవాటు. ఇక ఈమె సొట్టబుగ్గలకి కూడా నెటిజన్లు ఫిదా అయిపోతుంటారు. బిగ్ బాస్ హౌస్ లో భోలే షావలి తన అందాలని వర్ణించిన తీరుకి ఇన్ స్టా లో ట్రోల్స్ మామూలుగా లేవు. బిగ్ బాస్ తర్వాత భోలేతో కలిసి రీల్ చేసి మరింత ఫేమస్ అయింది. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో రెగ్యులర్ గా రీల్స్ చేస్తు మరింత క్రేజ్ పొందుతుంది ఈ భామ.
![]() |
![]() |